ఇండియన్‌ 2కు యంగ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Anirudh To Score Music For Indian 2 - Sakshi

సంచలన విజయం సాధించిన ఇండియన్‌ (తెలుగులో భారతీయుడు) సినిమాకు సీక‍్వల్‌గా ఇండియన్‌ 2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే దర్శకుడు శంకర్‌... 2.ఓ పనుల్లో బిజీగా ఉండటం, కమల్‌ హాసన్‌ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ప్రీ ప్రొడక్షన్‌ పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సౌత్‌ ఫిలిం సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అపరిచితుడు, నన్బన్‌ చిత్రాలకు తప్ప మిగతా అన్ని సినిమాలకు ఏఆర్‌ రెహమానే సంగీతమందించారు. కానీ ఇండియన్‌ 2కు మాత్రం రెహమాన్ పనిచేయటం లేదన్న ప్రచారం జరుగుతోంది. రెహమాన్ స్థానంలో ఈ సినిమాకు అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఫైనల్‌ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అనిరుధ్‌ను గోల్డెన్‌ ఛాన్స్‌ వరించినట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

రజనీకాంత్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ షూటింగ్ ఇప్పటికే పూర్తి  కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యేది ఇంతవరకు ఫైనల్‌ చేయలేదు. 2.ఓ ఓ నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ఇండియన్‌ 2 ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా కానిచ్చేస్తున్నాడు శంకర్‌. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమయ్యేది అధికారికంగా వెళ్లడించనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top