మహేశ్‌ బాబుకు అనిల్‌ ఫ్యామిలీ మెసేజ్‌..

Anil Ravipudi Family Sankranthi Wishes To Mahesh Babu Family - Sakshi

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అనిల్‌కు అవకాశం కల్పించినందుకు ఆయన కుటుంబ సభ్యులు మహేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పండగ ముందుగానే బ్లాక్‌బస్టర్‌కా బాప్‌ ఇచ్చారని అన్నారు. మహేశ్‌ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్‌ ఈ చిత్రంలో డ్యాన్స్‌లు ఇరగదీశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

అలాగే అనిల్‌ కుటుంబానికి నమ్రత కృతజ్ఞతలు తెలిపారు. బిగ్గెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌ ఇచ్చినందుకు అనిల్‌కు ధన్యవాదాలు చెప్పారు. కాగా, మహేశ్‌, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత లేడి అమితాబ్‌ విజయశాంతి ఈ చిత్రంతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో మహేశ్‌, విజయశాంతిల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top