ఫెమినిస్ట్ ఐకాన్గా ఏంజిలినా | Angelina Jolie named top feminist icon | Sakshi
Sakshi News home page

ఫెమినిస్ట్ ఐకాన్గా ఏంజిలినా

Mar 30 2015 11:42 AM | Updated on Sep 2 2017 11:36 PM

ఫెమినిస్ట్ ఐకాన్గా ఏంజిలినా

ఫెమినిస్ట్ ఐకాన్గా ఏంజిలినా

లండన్: హాలీవుడ్ తార ఏంజిలినా జోలి మరో ఘనత దక్కించుకున్నారు. బ్రిటన్లో ఆమె టాప్ ఫెమినిస్ట్ ఐకాన్గా నిలిచారు.

లండన్: హాలీవుడ్ తార ఏంజిలినా జోలి మరో ఘనత దక్కించుకున్నారు. బ్రిటన్లో ఆమె టాప్ ఫెమినిస్ట్ ఐకాన్గా నిలిచారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్న ఆమె ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం నిర్వహించడంతో ఆమె ఈ ఏడాది బ్రిటన్ ఫెమినిస్ట్ ఐకాన్గా నిలిచారు. ఈ అవార్డుకు గానూ ఆమె జర్మన్కు చెందిన హక్కుల కార్యకర్త గ్రీర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నారు.

'మేం మహిళ స్వశక్తితోనే ముందుకు వెళుతున్నాం. వారి ఘనతకు గుర్తింపుగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల హక్కుల విషయంలో ఏంజిలినా చాలా చక్కగా పనిచేస్తున్నారు' అని ఫెమినిస్ట్ ఫ్యాషన్ వ్యవస్థాపక అధ్యక్షులు హైడీ రహ్మాన్ తెలిపారు. ఈ అవార్డు అందజేయడం కోసం డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.రోసియాండ్విల్లార్డ్.కామ్ అనే సంస్థ బ్రిటన్ వ్యాప్తంగా ఆన్ లైన్ పోల్ నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement