పులికి శిక్షణ ఇచ్చి నిద్రపుచ్చడం చూశాను.. | Aneesha Told Her Love Story With Vishal | Sakshi
Sakshi News home page

అనీషాతో అలా మొదలైంది!

Jan 18 2019 11:20 AM | Updated on Jan 18 2019 11:20 AM

Aneesha Told Her Love Story With Vishal - Sakshi

చెన్నై ,పెరంబూరు: అనీషాతో ప్రేమ ఎలా మొదలైందంటే అని నటుడు విశాల్‌ చెప్పుకొచ్చారు. ఈయన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త దినేశ్‌రెడ్డి, సరిత దంపతుల కూతురు అనీషా అల్లారెడ్డిని పెళ్లాడబోతున్న విషయాన్ని ఇటీవల బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జంట వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. అనీషారెడ్డి నటి అన్నది గమనార్హం. తెలుగులో అర్జున్‌రెడ్డి, పెళ్లిచూపులు వంటి చిత్రాల్లో నటించారు. ఈమె సామాజిక సేవల్లోనూ తన వంతు కృషిచేస్తున్నారు. అంతేకాదు అనీషా జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి. ఆమెతో పరిచయం ఎలా ప్రేమగా మారింది అన్న విషయాలను నటుడు విశాల్‌ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అవేంటో చూద్దాం.

నేను గత ఏడాది అక్టోబర్‌లో విశాఖపట్టణంలో జరిగిన అయోగ్య చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాను. అప్పుడు ఆ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటున్న మహిళలు మాత్రమే నటిస్తున్న ఆల్‌ అబౌట్‌ మిచ్చలో అనే అంగ్ల చిత్ర యూనిట్‌ను కలిసే అవకాశం లభించింది. ఆ చిత్రంలో అనీషా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు నటించడం చూసి ఆకర్షితుడినై ఆ చిత్ర నిర్మాణాన్ని నేనే చేపట్టాను. అప్పటి నుంచి ఆ చిత్రానికి సంబంధించిన వ్యవహారాల గురించి తరచూ అనీషాను కలుసుకునేవాడిని. ఆ పరిచయమే ఇప్పుడు పెళ్లికి దారి తీసింది. భగవంతుడు ఆమెను నాకోసం పంపారు. అనీషాతో ముందుగా నేనే ప్రేమను వ్యక్తం చేశాను. వివాహనంతరం అనీషాను నటించవద్దని చెప్పను. ఆమెకు ఏది ఇష్టమో అది చేయవచ్చు.

పులికి శిక్షణ: సమీపం కాలంలో అనీషా పులికి శిక్షణ ఇస్తున్న వీడియోను చూశాను. అందులో త ను పులికి శిక్షణ ఇచ్చి నిద్రపుచ్చడం చూశాను. నేను మృగాలతో ఒక చిత్రం చేయాలని నిర్ణయిం చుకున్నాను. దానికి అనీషా తోడ్పాటును కోరతాను. అన్నీ సక్రమంగా ఉంటే ఈ ఏడాదే ఆ చిత్రాన్ని రూపొందిస్తాను. ఆ చిత్రంలో అనీషా పా ల్గొంటారు. అదే విధంగా కొత్తగా నిర్మిస్తున్న నడిగర్‌సంఘం భవనంలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయాన్నీ అనీషాకు చెప్పాను. అం దు కు తనూ ఓకే చెప్పారు అని విశాల్‌ పేర్కొన్నారు.

నా ప్రేమికుడిని కలిశాను: కాగా విశాల్‌కు కాబోయే జీవిత భాగస్వామి అనీషా తన ట్విట్టర్‌లో పేర్కొంటూ కొత్త జీవితంలోకి ప్రవేశించనున్నాను. నాతో పయనించే, నా సుఖ దుఖాలతో పాలు పంచుకునే నా ప్రేమికుడిని కలుసుకున్నాను. ఆయన కోసమే ఇంతకాలం ఎదురు చూశాను అని ఆనందంతో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement