ఆండ్రియూ ఐటమ్ సాంగ్ | andrea jeremiah item song in poojai | Sakshi
Sakshi News home page

ఆండ్రియూ ఐటమ్ సాంగ్

May 7 2014 11:03 PM | Updated on Sep 2 2017 7:03 AM

ఆండ్రియూ ఐటమ్ సాంగ్

ఆండ్రియూ ఐటమ్ సాంగ్

స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్‌కు చిందేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పాటలతో హీరోయిన్లకు అధిక మొత్తంలో ఫీజు, ప్రేక్షకులకు మోజు,

 స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్స్‌కు చిందేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పాటలతో హీరోయిన్లకు అధిక మొత్తంలో ఫీజు, ప్రేక్షకులకు మోజు, సినిమాకు క్రేజు, నిర్మాతకు డబ్బు, టోటల్‌గా చిత్రం సేఫ్. ఇది ఐటమ్‌సాంగ్‌ల ఫార్ములా. ఇంతకి ఆండ్రియూ ఐటమ్‌సాంగ్ వివరాలు చెప్పలేదు కదూ. హరి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పూజైలో విశాల్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని విశాల్ తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.
 
 ఈ చిత్రంలోని ప్రత్యేక పాటతో సంచలన నటి ఆండ్రియూ విశాల్‌తో కలిసి ఆడనున్నారు. ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్‌లో తళుక్కుమన్న ఆండ్రియూ ఐటమ్ సాంగ్ చేస్తున్న తొలి చిత్రం మాత్రం ఇదే కావడం విశేషం. నా. ముత్తుకుమార్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీత బాణీలు కట్టారు. చెన్నైలో  ఒక భారీ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సెట్‌లో దర్శకుడు హరి చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement