తెలంగాణ యాస వచ్చేసింది – అనసూయ | Anchor Anasuya Stills At Sachindira Gorre Movie Press Meet | Sakshi
Sakshi News home page

తెలంగాణ యాస వచ్చేసింది – అనసూయ

Oct 30 2017 12:42 AM | Updated on Oct 30 2017 12:43 AM

Anchor Anasuya Stills At Sachindira Gorre Movie Press Meet

శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు ముఖ్యతారలుగా శ్రీధర్‌రెడ్డి యార్వా దర్శకత్వంలో దీపక్‌ ముఖుత్, ఎన్‌.ఎం. షాషా నిర్మిస్తున్న సినిమా ‘సచ్చిందిరా... గొర్రె’. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ–‘‘ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రమిది. నేను నల్గొండ అమ్మాయినే. కాకపోతే.. హైదరాబాద్‌లో పెరగడం వల్ల ఇక్కడి మాటతీరు వచ్చింది.

అయితే.. ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లగానే తెలంగాణ యాస వచ్చేసింది’’ అన్నారు. ‘‘విభిన్న పాత్రలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది’’ అన్నారు శ్రీనివాస రెడ్డి. ‘‘నాలుగేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డికి కథ చెప్పా. విభిన్నమైన కథ. తెరపై చూస్తుంటే అందమైన అనుభవంలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్‌రెడ్డి. ‘‘కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రాలను నిర్మించాలని వచ్చాం. ఈ సినిమా 50 శాతం పూర్తయింది. డిసెంబర్‌కి మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. నటులు తాగుబోతు రమేష్, టిల్లు వేణు, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement