పోలీస్ గెటప్లో అనసూయ | Anasuya dons khaki in 'Kshanam' | Sakshi
Sakshi News home page

పోలీస్ గెటప్లో అనసూయ

Jan 21 2016 12:23 PM | Updated on Aug 28 2018 4:30 PM

పోలీస్ గెటప్లో అనసూయ - Sakshi

పోలీస్ గెటప్లో అనసూయ

వెండి తెరపై అనసూయ మళ్లీ మెరవనుంది.

చెన్నై :  వెండి తెరపై అనసూయ మళ్లీ మెరవనుంది. ఇటీవలే సొగ్గాడే చిన్నినాయనా చిత్రంలో తళుక్కన మెరిసిన అనసూయ... ఈసారి మాత్రం పవర్ఫుల్ పాత్రలో నటించనుంది. 'క్షణం' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ఆమె ఒదిగిపోనుంది. నీతి నిజాయితీకి మారు పేరుగా మలిచిన పాత్రలో అనసూయ నటించనుంది.

పీవీపీ సినిమా నిర్మిస్తున్న 'క్షణం' చిత్రానికి రవికాంత్ పి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారం చెన్నైలో వెల్లడించింది. ఈ చిత్రంలో ఆ పాత్ర పోషించేందుకు పలువురు మహిళా పోలీసు అధికారులను అనసూయ దగ్గర నుంచి పరిశీలించారని తెలిపింది. ఆ పాత్రలో నటించేందుకు ఆమె చాలా ప్రిపేరయిందని ... ఆ తర్వాతే నటించేందుకు అనసూయ ఒప్పుకుందని యూనిట్ పేర్కొంది.

ఈ చిత్రంలోని అనసూయ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సస్పెన్స్, శృంగారం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవి శేషు, అదా శర్మ ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement