వైరల్‌ అవుతున్న ‘దొరసాని’ టీజర్‌

Anand Deverakonda Dorasani Movie teaser Gets One Million Views - Sakshi

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ, జీవితా రాజశేఖర్‌ కుమార్తె శివాత్మిక జంటగా రాబోతోన్న దొరసాని టీజర్‌ గురువారం విడుదలైంది. పాత కథే అయినా ట్రీట్‌మెంట్‌ కొత్తగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ప్రేమ కథను గడీల కాలంలోకి తీసుకెళ్లి తెలంగాణ ఫ్లేవర్‌ను కలపడంతో ఈ టీజర్‌కు కొత్త లుక్‌ వచ్చింది. దీనికి తోడు ఆనంద్‌, శివాత్మిక తమ పాత్రల్లో కనిపించిన తీరు.. అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ టీజర్‌ 1మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కె.వి.ఆర్‌. మహేంద్ర దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్‌ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top