అంతా ఆ దేవుడి లీల! | Amitabh Bachchan Unveiled Hindi Trailer Of Rajinikanth's Kochadaiiyaan! | Sakshi
Sakshi News home page

అంతా ఆ దేవుడి లీల!

Apr 2 2014 3:09 AM | Updated on Sep 2 2017 5:27 AM

అంతా ఆ దేవుడి లీల!

అంతా ఆ దేవుడి లీల!

‘‘సౌందర్య చిన్నప్పుడు ‘అమర్‌చిత్ర కథ’ పుస్తకాలు బాగా చదివేది. అలాంటి సినిమాలు తీస్తానని చెబుతుండేది. ఇప్పుడు అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ‘కొచ్చడయాన్’

 ‘‘సౌందర్య చిన్నప్పుడు ‘అమర్‌చిత్ర కథ’ పుస్తకాలు బాగా చదివేది. అలాంటి సినిమాలు తీస్తానని చెబుతుండేది. ఇప్పుడు అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ‘కొచ్చడయాన్’ రూపొందించింది. అందరూ తనను అభినందిస్తుంటే ఓ తండ్రిగా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’’ అన్నారు రజనీకాంత్. తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఆయన నటించిన ‘కొచ్చడయాన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ప్రచార చిత్రాలను ముంబయ్‌లో అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ -‘‘రజనీకాంత్, నేనూ మంచి స్నేహితులం. ఎప్పుడు కలిసినా సినిమాల గురించి, జీవితం గురించి మాట్లాడుకుంటాం. 
 
  భారతీయ సినిమా చరిత్రను ఎవరైనా రాస్తే... ‘కొచ్చడయాన్’కి ముందు ‘కొచ్చడయాన్’కి తర్వాత అని రాస్తారు’’ అని చెప్పారు. రజనీకాంత్ మాట్లాడుతూ -‘‘ ‘రోబో’ సమయంలో ముంబై వచ్చాను. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడీ వేడుకలో పాల్గొన్నాను. ‘కొచ్చడయాన్’ సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. టెక్నాలజీ గురించి నాకస్సలు అవగాహన లేదు. కానీ, ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నానంటే, అంతా ఆ దేవుడి లీల. ఇలాంటి సినిమాలు ఓ సవాల్ . ఈ సవాల్ నాకు మంచి అనుభూతిని మిగిల్చింది’’ అని చెప్పారు. హలీవుడ్ చిత్రం ‘అవతార్’ స్థాయిలో ఫొటో రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ టెక్నాలజీతో రూపొందిన తొలి భారతీయ సినిమా ఇదే కావడం విశేషం. తెలుగులో ఈ చిత్రం ‘విక్రమసింహ’ పేరుతో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement