ఆయనకు కోటిన్నర మంది ఫాలోవర్లు! | amitabh bachchan gets 1.5 million followers in twitter | Sakshi
Sakshi News home page

ఆయనకు కోటిన్నర మంది ఫాలోవర్లు!

May 30 2015 4:33 PM | Updated on Sep 3 2017 2:57 AM

ఆయనకు కోటిన్నర మంది ఫాలోవర్లు!

ఆయనకు కోటిన్నర మంది ఫాలోవర్లు!

బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆయన మహా యాక్టివ్గా ఉంటారు.

బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆయన మహా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు తోచిన విషయాలు, తెలిసిన విశేషాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. తన సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడకు సమీపంలో కాల్పులు జరిగిన విషయాన్ని కూడా కొద్ది నిమిషాల్లోనే ట్వీట్ చేశారు.

మరి అంత యాక్టివ్గా ఉండే అమితాబ్కు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసా? అక్షరాలా కోటీ యాభై లక్షల మంది!! అవును,  @srbachchan పేరుతో అమితాబ్ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను ఇప్పటికి కోటిన్నర మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ బచ్చన్ సాబ్ తెలిపారు. అంతేకాదు.. అంతమంది తనను ఫాలో అవుతున్నందుకు ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. ట్విట్టర్.. 1.5 మిలియన్.. య్యా.... బడూంబా.. అంటూ మొన్నీమధ్య ట్వీట్ చేశారీ పెద్దాయన.

 

Advertisement
 
Advertisement
Advertisement