డాన్‌ను అదేదో బ్రాండ్‌ అనుకున్నారు

Amitabh Bachchan celebrates 41 years of Don - Sakshi

ఇప్పటి కమర్షియల్‌ సినిమాల్లో డాన్‌ పాత్ర చాలా రెగ్యులర్‌ అయిపోయింది. డాన్‌ అంటే ఓ పవర్‌ఫుల్‌ విలన్‌. కానీ 41 ఏళ్ల క్రితం పరిస్థితి ఇది కాదు అంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. అమితాబ్‌ కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ‘డాన్‌’ ఒకటి. ఆ సినిమా విడుదలై 41 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ టైటిల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ గురించి అమితాబ్‌ పంచుకుంటూ– ‘‘ఇండస్ట్రీలో చాలామంది డాన్‌ టైటిల్‌పై ఆసక్తి చూఫలేదు. డాన్‌ అంటే అర్థం కూడా చాలామందికి తెలియదు.

హిందీ సినిమా టైటిల్‌లానే లేదన్నారు. ఈ టైటిల్‌ పలకడంలో ఓ పాపులర్‌ లో దుస్తుల కంపెనీ పేరుకు దగ్గరగా ఉందని, చాలా మంది ఇదేం టైటిల్‌ అని విచిత్రంగా చూశారు. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా రిలీజైన తర్వాత ‘డాన్‌’ అనే పేరు కొంచెం గౌరవప్రదంగా మారిందని, దాని ముందు వరకూ కామెడీగానే ఉంది’’ అన్నారు. సలీమ్‌– జావేద్‌ రచించిన ఈ చిత్రాన్ని ఎన్టీరా మారావు, రజనీకాంత్, షారుక్, అజిత్, ప్రభాస్‌... తర్వాత కాలంలో తమ భాషల్లో రీమేక్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top