అమీర్‌పేటలో... | "Amirpetalo ' Sri, Ashwini | Sakshi
Sakshi News home page

అమీర్‌పేటలో...

Aug 1 2016 1:05 AM | Updated on May 28 2018 3:47 PM

అమీర్‌పేటలో... - Sakshi

అమీర్‌పేటలో...

శ్రీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘అమీర్‌పేటలో’. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై మహేశ్ నిర్మించిన ...

శ్రీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘అమీర్‌పేటలో’. అశ్విని కథానాయిక. పద్మశ్రీ క్రియేషన్స్ పతాకంపై మహేశ్ నిర్మించిన ఈ చిత్రం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ -‘‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన నేను అమీర్‌పేటలోని పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి స్టోరీ రాసుకున్నా. దాన్నే తెరమీద ఆవిష్కరించాం. టైటిల్, పోస్టర్, టీజర్, పాటల విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఈ చిత్రం ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.


ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళుతున్నాం’’ అని చెప్పారు. ‘‘మురళి స్వరపరచిన పాటలు ఓ హైలైట్‌గా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిన చిత్రమిది. మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రం చిన్న చిత్రాల్లో ఓ టార్గెట్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత చెప్పారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement