టైటిల్‌ నాకు బాగా నచ్చింది

Amaram Akhilam Prema Movie Teaser Launch - Sakshi

– కొరటాల శివ

విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్‌ జంటగా జోనాథన్‌ ఎడ్వర్డ్‌ దర్శకత్వంలో వీఈవీకేడీఎస్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘అమరం అఖిలం ప్రేమ’. ‘ప్రేమించటం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్, కొరటాల శివ ఆవిష్కరించారు. ‘‘అమరం అఖిలం ప్రేమ’ టైటిల్‌ నాకు బాగా నచ్చింది. ప్రసాద్‌గారు నిర్మాతగా సక్సెస్‌ కావాలి’’ అన్నారు కొరటాల శివ. ‘‘ప్రసాద్, నేను లెక్చరర్స్‌గా కలిసి పనిచేశాం. ఆయన ఈ సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టిస్టుగా బాగా పెర్ఫార్మ్‌ చేయగలిగితే, హీరోగా చేయడానికి అంత కన్నా పెద్ద లక్షణం అవసరం లేదు. అది విజయ్‌రామ్‌లో చూశాను.

జోనాథన్‌ తీసిన ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చూసి స్ఫూర్తి పొందాను. జోనాథన్‌ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సినిమాకు శ్రీకాంత్‌ మంచి డైలాగ్స్‌ రాశాడు. అల్లు అర్జున్‌తో నేను తెరకెక్కిస్తున్న సినిమాకు శ్రీకాంత్‌ మాటలు రాస్తున్నాడు’’ అన్నారు. ‘‘సుకుమార్‌గారు లేకుంటే ఈ సినిమా ప్రారంభం అయ్యేది కాదు. ప్రసాద్‌గారు సహనశీలి’’ అన్నారు జోనాథన్‌. ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఆడిన సినిమా పెద్ద సినిమా అవుతుంది. విజయ్‌రామ్‌ హీరోగా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత ప్రసాద్‌. కెమెరామెన్‌ రసూల్‌ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్, దర్శకుడు హరి ప్రసాద్‌ జక్కా, మాటల రచయిత శ్రీకాంత్‌ విస్సా తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top