విష్ణువిశాల్‌తో అమలాపాల్‌ మిన్‌మిని | Amalapal with Vishnu Vishal | Sakshi
Sakshi News home page

విష్ణువిశాల్‌తో అమలాపాల్‌ మిన్‌మిని

May 1 2017 1:39 AM | Updated on Sep 5 2017 10:04 AM

విష్ణువిశాల్‌తో అమలాపాల్‌ మిన్‌మిని

విష్ణువిశాల్‌తో అమలాపాల్‌ మిన్‌మిని

కోలీవుడ్‌లో సంచలన నటీమణుల్లో అమలాపాల్‌ ఒకరని చెప్పక తప్పదు.

కోలీవుడ్‌లో సంచలన నటీమణుల్లో అమలాపాల్‌ ఒకరని చెప్పక తప్పదు. మైనా చిత్రంతో సినీ పల్లకిలో స్వారీ మొదలెట్టిన ఈ కేరళాకుట్టికి ఆ తరువాత వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే చాలా షార్ట్‌టైమ్‌లోనే లవ్‌లో పడి దర్శకుడు విజయ్‌ను మ్యారేజ్‌ చేసుకోవడంతో యాక్టింగ్‌కు బ్రేక్‌ వేసుకున్నారు. అదీ చాలా షార్ట్‌టైమే. రెండేళ్లలోపే విజయ్‌కు విడాకులు ఇచచిచ బ్యాక్‌ టూ ఫిల్మ్‌ అంటూ యాక్టింగ్‌కు వచ్చేశారు. అయితే ఈ సారి నటిగా స్పీడ్‌ను యమాగా పెంచేశారు.

అదీ కథానాయకిగానే వరస పెట్టి నటించేస్తున్నారు. తనకు ఇష్టమైన నటుడు ధనుష్‌తో నటించే చిత్రాన్నే వదులుకునేంత బిజీ అయ్యారు. తిరుట్టుపయలే–2, భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ ఇలా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న అమలాపాల్‌ యువ నటుడు విష్ణువిశాల్‌తోనూ ఒక చిత్రం చేస్తున్నారు. ఇందులో విష్ణువిశాల్‌ పోలీస్‌గా నటిస్తుంటే అమ్మడు అమలాపాల్‌ పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌గా కనిసిస్తున్నారు. ముండాసిపట్టి చిత్రం ఫేమ్‌ రామ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యాక్సెస్‌ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. పాఠశాల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి మిన్‌మిని అనే టైటిల్‌ నిర్ణయించారు.

చిత్ర షూటింగ్‌ ఇప్పటికే సైలెంట్‌గా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందట. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒకే ఒక్క పాట ఉంటుందట. అదీ మాంటేజ్‌ సాంగ్‌ అట. అందువల్ల ఈ పాటను ప్రత్యేకంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదని దర్శకుడు పేర్కొన్నారు. చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవలే మొదలైనట్లు తెలిపారు. మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయట. త్వరలో పాటలను, ఆ వెంటనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని దర్శకుడు రామ్‌కుమార్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement