సమంత అవుట్ అమలాపాల్‌ ఇన్ | Amala Paul in place of Samantha in mega project? | Sakshi
Sakshi News home page

సమంత అవుట్ అమలాపాల్‌ ఇన్

Jul 9 2016 2:04 AM | Updated on Sep 4 2017 4:25 AM

సమంత అవుట్ అమలాపాల్‌ ఇన్

సమంత అవుట్ అమలాపాల్‌ ఇన్

ధనుష్, అమలాపాల్‌లది హిట్ జంట అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయాన్ని సాధించింది...

ధనుష్, అమలాపాల్‌లది హిట్ జంట అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి నటించిన వేలై ఇల్లా పట్టాదారి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అదే విధంగా ఇటీవల ధనుష్ నిర్మించిన అమ్మకణక్కు చిత్రంలో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా మరోసారి ధనుష్‌తో కలిసి నటించడానికి అమలాపాల్ రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. అయితే నటి సమంత నటించాల్సిన పాత్రలో అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

అసలు విషయం ఏమిటంటే ధనుష్ దర్శకుడు వెట్రిమారన్‌ల కాంబినేషన్‌లో వడచెన్నై చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. దీన్ని దర్శకుడు మూడు భాగాలుగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందులో ధనుష్‌కు జంటగా సమంతను ఎంపిక చేశారు.అయితే తను టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వడచెన్నై చిత్రం నుంచి వైదొలగినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ఆమె పాత్రలో నటి అమలాపాల్‌ను ఎంపిక చేసినట్లు, ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్,ధనుష్ వుండర్‌బార్ ఫిలింస్, దర్శకుడు వెట్రిమారన్ గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement