యంగ్‌  అండ్‌  డైనమిక్‌ | Allu Sirish's movie has a title change | Sakshi
Sakshi News home page

యంగ్‌  అండ్‌  డైనమిక్‌

Feb 21 2018 12:05 AM | Updated on Feb 21 2018 12:05 AM

 Allu Sirish's movie has a title change - Sakshi

అల్లు శిరీష్‌

తెలుగులో పట్టుమని పది సినిమాలు నటించకుండానే మాలీవుడ్‌ ఇండస్ట్రీ గడప తొక్కారు హీరో అల్లు శిరీష్‌. అక్కడి ఫ్యాన్స్‌ కూడా మల్లుభాయ్‌ అదేనండీ.. అల్లు అర్జున్‌ తమ్ముడని ఈజీగా శిరీష్‌ను ఓన్‌ చేసుకున్నారు. కానీ ‘1971: బియాండ్‌ ది బోర్డర్స్‌’ సినిమా తర్వాత శిరీష్‌కి సెపరేట్‌ ఐడెంటిటీ వచ్చింది. బన్నీ బ్రదర్‌ అని కాకుండా హీరో శిరీష్‌ అనడం మొదలుపెట్టారు. మోహన్‌లాల్, అరుణోదయ్‌ సింగ్, అల్లు శిరీష్‌ ముఖ్య తారలుగా మేజర్‌ రవి దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘1971: బియాండ్‌ ది బోర్డర్స్‌’.

ఈ చిత్రాన్ని జాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతకాలపై ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌తో ఏయన్‌ బాలాజీ తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్‌ తెలుగులో డబ్బింగ్‌ చెబుతున్న ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరులో రిలీజ్‌ చేసి, చిత్రాన్ని మార్చిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘‘మేజర్‌గా మోహన్‌లాల్, ఎనర్జిటిక్‌ అండ్‌ యంగ్‌ డైనమిక్‌ సోల్జర్‌గా అల్లు శిరీష్‌ కనిపిస్తారు. గతంలో తమిళ్, హిందీ, మలయాళ చిత్రాలను తెలుగులో అనువదించాను. మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా  సక్సెస్‌ అవుతుంది. మార్చి ఫస్ట్‌ వీక్‌లో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు బాలాజీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement