అల్లు వారబ్బాయి వేదాంతం | Allu Sirish Next Movie Ye Nimishaniki Yemi Jaruguno | Sakshi
Sakshi News home page

అల్లు వారబ్బాయి వేదాంతం

Jun 21 2017 11:31 AM | Updated on Sep 5 2017 2:08 PM

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. భారీ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సక్సెస్

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అల్లు శిరీష్. భారీ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు శిరీష్. ఇటీవల విడుదలైన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. అయితే సక్సెస్ ట్రాక్ ను అలానే కంటిన్యూ చేయాలనే పట్టుదలతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు శిరీష్. సురభి, సీరత్ కపూర్లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement