అభిమాన నటుడితో మెగా హీరో

Allu Sirish Is Also A Part Of Suriya Mohan lal Multistarrer - Sakshi

మలయాళ స్టార్‌ హీరో కంప్లీట్‌యాక్టర్‌ మెహన్‌ లాల్‌, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్‌ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ టాలీవుడ్‌ యంగ్ హీరో కూడా నటించనున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ ఇమేజ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్‌, మెహన్‌ లాల్‌, సూర్య కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట.

ఈ విషయాన్ని అల్లు శిరీష్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌లో అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. తన అభిమాన హీరో సూర్యతో కలిసి నటించటం, మోహన్‌ లాల్‌ లాంటి టాప్‌ హీరోతో రెండో సారి కలిసి నటించే అవకాశం రావటం ఆనందంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు శిరీష్.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top