ఒక్క క్షణమే! | Allu Sirish’s Okka Kshanam First Look | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణమే!

Nov 29 2017 11:59 PM | Updated on Nov 29 2017 11:59 PM

Allu Sirish’s Okka Kshanam First Look - Sakshi

‘ఒక్క క్షణం’లో ఏం జరుగుతుంది? ఏదైనా జరగొచ్చు! ఎవరు చెప్పగలరు? ఏం జరుగుతుందో!! ఓడలు బళ్లు కావొచ్చు... బళ్లు ఓడలు కావొచ్చు. మరి, అల్లు శిరీష్‌ రీల్‌ లైఫ్‌లో ‘ఒక్క క్షణం’ లో ఏం జరిగిందో! ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా నటించిన సినిమాకి ‘ఒక్క క్షణం’ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సురభి, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. 

ఇప్పుడు శిరీష్, సురభి ఉన్న లుక్‌ను విడుదల చేశాం. దీనికీ మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో, కాశీ విశ్వనాథ్, రోహిణి, జయప్రకాశ్, ప్రవీణ్, సత్య, సుదర్శన్‌ తదితరులు ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సహ–నిర్మాతలు: సతీష్‌ వేగేశ్న, రాజేష్‌ దండ, సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement