అల్లువారి కోడలి ఫన్నీ చాలెంజ్‌.. | Allu Neelu Shah Superb Funny Challenge During LockDown | Sakshi
Sakshi News home page

అల్లువారి కోడలి ఫన్నీ చాలెంజ్‌..

Apr 26 2020 2:33 PM | Updated on Apr 26 2020 3:01 PM

Allu Neelu Shah Superb Funny Challenge During LockDown - Sakshi

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన చాలా మంది సరికొత్త చాలెంజ్‌లతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్‌(బాబీ) సతీమణి నీలు షా సరికొత్త ఫన్నీ చాలెంజ్‌ చేసి చూపెట్టారు . కాళ్లకు సాక్స్‌లు ధరించి శీర్షాసనం వేసిన ఆమె.. ఒక కాలితో మరో కాలికి ఉన్న సాక్స్‌ను తొలగించారు. ఇలా శీర్షాసనంలో ఉండగానే రెండు కాళ్లకు ఉన్న సాక్స్‌లను తొలగించేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను నీలు షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఫన్‌ చాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ అని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలని.. సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement