NHAI కొత్త ఛాలెంజ్‌.. రూ.1000 పొందే అవకాశం! | Spot A Dirty Toll Plaza Toilet Click A Photo NHAI Will Pay You Rs 1000 | Sakshi
Sakshi News home page

NHAI కొత్త ఛాలెంజ్‌.. రూ.1000 పొందే అవకాశం!

Oct 18 2026 6:50 PM | Updated on Oct 18 2026 6:52 PM

Spot A Dirty Toll Plaza Toilet Click A Photo NHAI Will Pay You Rs 1000

జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు టోల్‌ ప్లాజాల వద్ద ఉన్న టాయిలెట్లు అపరిశుభ్రంగా కనిపిస్తే ఫొటో తీసి ఫిర్యాదు చేయొచ్చు. ఇలా ఫిర్యాదు చేసిన వారికి రూ.1,000 రివార్డు అందించేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్‌'ను తీసుకొచ్చింది.

ముఖ్య ఉద్దేశం  ఏమిటంటే?
జాతీయ రహదారులపై పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల ఫొటోలను ప్రయాణికులు రాజ్‌మార్గ్‌యాత్ర (RajmargYatra) యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి.

ఇందుకోసం యాప్‌ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగించాలి. ఫొటోతో పాటు పేరు, ప్రదేశం, వెహికల్ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలను కూడా నమోదు చేయాలి. ఫిర్యాదు సరైనదని నిర్ధారణ అయితే.. సంబంధిత వాహనం ఫాస్ట్‌ట్యాగ్‌కు రూ.1,000 రీఛార్జిగా జమ చేస్తారు. అంటే.. ఈ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడం కుదరదన్నమాట.

NHAI పరిధిలో ఉండాలి
అయితే.. ఈ అవకాశం అన్ని టాయిలెట్లకు వర్తించదు. NHAI పరిధిలో నిర్మించిన లేదా నిర్వహిస్తున్న టాయిలెట్లు మాత్రమే ఈ పథకంలోకి వస్తాయి. పెట్రోల్‌ బంకులు, రహదారి పక్కన ఉండే డాబాలు, ఇతర ప్రైవేట్‌ సౌకర్యాల్లోని టాయిలెట్లపై ఫిర్యాదులకు ఈ రివార్డు వర్తించదు. ఒక్క వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌పై ప్రచార సమయంలో ఒకసారి మాత్రమే రివార్డు పొందవచ్చు. ఒకే టాయిలెట్‌పై ఒకే రోజు పలువురు ఫిర్యాదు చేస్తే, ముందుగా అందిన సరైన ఫొటోను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఫొటోలు స్పష్టంగా ఉండాలి. వాటిలో ప్రదేశం, సమయానికి సంబంధించిన వివరాలు కూడా నమోదు కావాలి. ఎడిట్‌ చేసిన ఫొటోలు, నకిలీ ఫోటోలు లేదా గతంలో పంపించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తే ఫిర్యాదును తిరస్కరిస్తారు. ఫిర్యాదులను పరిశీలించేందుకు ఏఐ (AI) సాంకేతికతను ఉపయోగించడంతో పాటు అవసరమైనప్పుడు అధికారులు కూడా తనిఖీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement