ఆల్‌టైం రికార్డులు తిరగరాస్తోన్న ‘సరైనోడు’ | Allu Arjuns Sarrainodu Hindi Version Breaks Records In YouTube | Sakshi
Sakshi News home page

ఆల్‌టైం రికార్డులు తిరగరాస్తోన్న ‘సరైనోడు’

Jul 16 2018 7:35 PM | Updated on Jul 23 2019 11:50 AM

Allu Arjuns Sarrainodu Hindi Version Breaks Records In YouTube - Sakshi

అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఆన్‌లైన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ హీరో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ ‘సరైనోడు’అరుదైన రికార్డ్‌ సృష్టించింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా ఆన్‌లైన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌కు యూట్యూబ్‌లో 20 కోట్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. దీంతో యూట్యూబ్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చలనచిత్రంగా ‘బన్నీ’ నటించిన సరైనోడు నిలవడం విశేషం. అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ను 2017 మే 28న గోల్డ్‌ మైన్స్‌ టెలిఫిలింస్‌ సంస్థ తమ యూట్యూబ్‌ చానల్‌ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

లైక్స్‌లోనూ రికార్డే
20 కోట్ల మందికి పైగా వీక్షించగా, ఆరు లక్షలకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది. అయితే వ్యూస్‌తో పాటు లైక్స్‌లోనూ సరైనోడు రికార్డులు తిరగరాసింది. ఏ భారతీయ చిత్రానికి లేని విధంగా రికార్డు స్థాయిలో 6.6 లక్షల లైక్స్‌తో అల్లు అర్జున్‌ మూవీ ఇంటర్నెట్‌లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తోంది. 2016లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూ.50కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సరైనోడు అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బన్నీ ఈ మూవీలో పూర్తిగా రఫ్‌ లుక్‌లో అదరగొట్టి మాస్‌ ఆడియెన్స్‌కు మరింత దగ్గరయ్యారు. రేసుగుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి తర్వాత విడుదలైన సరైనోడు అప్పట్లో బన్నీకి హ్యాట్రిక్‌ విజయాన్ని ఇచ్చింది.  తెలుగులో భారీ విజయం సాధించిన సరైనోడు.. బాలీవుడ్‌లోనూ రికార్డులు తిరగరాయడంపై బన్నీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement