బన్నీ బన్‌గయా డీజే! | Allu Arjun's next film titled as 'Duvvada Jagannadham' | Sakshi
Sakshi News home page

బన్నీ బన్‌గయా డీజే!

Aug 28 2016 11:27 PM | Updated on Sep 4 2017 11:19 AM

బన్నీ బన్‌గయా డీజే!

బన్నీ బన్‌గయా డీజే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజేగా కనిపించడానికి రెడీ అయ్యారు. డీజే అంటే పార్టీలు, పబ్బుల్లో గట్రా కనిపించే డిస్కో జాకీ (డీజే) కాదండీ.

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజేగా కనిపించడానికి రెడీ అయ్యారు. డీజే అంటే పార్టీలు, పబ్బుల్లో గట్రా కనిపించే డిస్కో జాకీ (డీజే) కాదండీ. ఇప్పుడీ పదానికి బన్నీ కొత్త అర్థం చెబుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న చిత్రానికి ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సినిమాలో హీరో ఊరు దువ్వాడ, పేరు జగన్నాథమ్ కావొచ్చని ఊహించవచ్చు. హైదరాబాద్‌లో నేడు ఈ సినిమా ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న 25వ చిత్రమిది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
 

Advertisement
 
Advertisement
Advertisement