త్వరలోనే చెబుతానంటోన్న బన్నీ! | Allu Arjun Will Announce About His Next Project Soon | Sakshi
Sakshi News home page

Nov 7 2018 6:22 PM | Updated on Nov 7 2018 6:25 PM

Allu Arjun Will Announce About His Next Project Soon - Sakshi

‘నా పేరు సూర్య’ ఫలితంతో నిరాశ చెందాడు స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. మళ్లీ ఇంతవరకు తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయంపై బన్నీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే అభిమానులు మాత్రం తమ హీరో ఎప్పుడెప్పుడు తన నెక్స్ట్‌ సినిమా ప్రకటిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. అయితే బన్నీ తన అభిమానులకు ఓ శుభవార్తను తెలియజేశాడు. 

‘నా పేరు సూర్య’ పరాజయంతో బన్నీ.. తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ముందుగా విక్రమ్‌ కె కుమార్‌తో సినిమా ఉంటుందని ప్రచారం సాగినా.. అది ఫైనల్‌ కాలేదనీ సమాచారం. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. అది కూడా ఓ హిందీ సినిమాను రీమేక్‌ చేయబోతున్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి. మరి వీటన్నంటికి బన్నీ త్వరలోనే పుల్‌స్టాప్‌ పెట్టబోతున్నాడు. ఇదే విషయాన్ని ట్వీట్‌ చేస్తూ.. ‘ ప్రతి ఒక్కరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దివాళి మన అందరి జీవితాల్లోకి వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. ఎప్పటినుంచో నా తదుపరి చిత్ర ప్రకటన గురించి ఎదురుచూస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటను త్వరలోనే ప్రకటిస్తాను’. అంటూ ట్వీట్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement