అల్లు అర్జున్‌ భావోద్వేగం

Allu Arjun Very Emotional Speech at Ala Vaikunthapurramuloo Musical Concert - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా ‘మ్యూజికల్‌ కన్సర్ట్‌’లో అల్లు అర్జున్‌ తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి అంత గొప్పవాడిని కాలేనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా గురించి మా నాన్నగారు, ఆయన గురించి నేను చెప్పుకోవడానికి కొంచెం మొహమాటం మాకు. ప్రేమ, కోపాలను లోపలే దాచుకుంటాం. నన్ను హీరోగా పరిచయం చేసింది నాన్నగారే. నేను చేసిన 20 సినిమాల్లో ఏడో ఎనిమిదో ఆయన తీసినవే.. వాటిలో హిట్స్, ఫ్లాప్స్‌ కూడా ఉన్నాయి. కానీ ఏనాడూ వేదికపై, ఇంట్లో ఆయనకు థ్యాంక్స్‌ చెప్పుకోలేదు..

నా జీవితంలో మొదటి సారి సభాముఖంగా ధన్యవాదాలు చెబుతున్నా.. నాకు కొడుకు పుట్టిన తర్వాత అర్థమైంది.. నేను మా నాన్నఅంత గొప్పవాణ్ణి ఎప్పుడూ అవలేను.. (చెమర్చిన కళ్లతో). ఆయనలో సగం కూడా అవలేను.. థ్యాంక్స్‌ నాన్నా. అరవింద్‌గారు డబ్బులు తినేస్తారు అంటుంటారు.. ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు.. అందుకే దాదాపు 45 ఏళ్లుగా సౌత్‌ ఇండస్ట్రీలో, ఇండియాలోనే మంచి నిర్మాతల్లో ఒక్కరిగా ఉన్నారాయన. మా తాతకి (అల్లు రామలింగయ్య) పద్మశ్రీ అవార్డు వచ్చింది. మా నాన్నగారికి కూడా ఆ అవార్డు ఇవ్వాలని, అందుకు ఆయన అర్హుడని ప్రభుత్వాలను కోరుతున్నా’ అని అల్లు అర్జున్‌ అన్నారు. (భార్య ముందు వచ్చే హీరోయిజంలో చాలా హాయి: అల్లు అర్జున్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top