అర్జున్‌ రెడ్డి చూసి బాగా డిస్ట్రబ్‌ అయ్యాను

Allu Arjun Speech At Geetha Govindam Audio Launch - Sakshi

అల్లు అర్జున్‌

‘‘తెలుగులో కొంతమంది మంచి నటులు, గొప్ప నటులు ఉన్నారు. విజయ్‌ గ్రేట్‌ పెర్ఫార్మర్‌. ఇది ఫీమేల్‌ డామినేటెడ్‌ సినిమా. విజయ్‌ ఎంత బాగా చేశాడంటే హీరో.. హీరోయిన్‌కి సమానమైన కథలాగా చేశాడు. ఇద్దరూ ఈక్వల్‌ పాయింట్స్‌ కొట్టారు. పరశురామ్‌కి ఇది బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుంది అనుకుంటున్నాను. చాలా బాగా తీశాడు’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. జీఎ2 పిక్చర్స్‌ పతాకంపై ‘బన్ని’ వాసు నిర్మించారు. గోపీ సుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే నెల 15న రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం ఆడియోను అల్లు అర్జున్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ –‘‘విజయ్‌ అడుగుతున్నాడు.. నేను ఎవరి కోసం ఈ ఫంక్షన్‌కి వచ్చాను అని. ‘బన్ని’ వాసు కోసమే వచ్చాను. ఇలా అన్నందుకు సారీ విజయ్‌. వాసు మంచి సినిమాలు తీస్తాడు. ఆల్‌ ది బెస్ట్‌. నా కెరీర్‌లో మా నాన్నగారి హెల్ప్‌ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ హెల్ప్‌ వాసూది ఉంటుంది. ఈ సినిమా చూశా. చాలా అంటే చాలా బావుంది. విజయ్, రష్మిక ఇద్దరూ రాక్‌ చేశారు. నాకు గోపీ సుందర్‌ మ్యూజిక్‌ చాలా ఇష్టం. సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌.

నా ‘పరుగు’ సినిమాకు పరశురామ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. అప్పటి నుంచి మెట్టు మెట్టు ఎదుగుతున్నారు. రష్మిక కన్నడ ‘కిర్రిక్‌  పార్టీ్ట’లో బాగా చేసింది అని విన్నాను. చూడటం కుదర్లేదు. ఈ సినిమాలో బాగా చేసింది. ఈ కథ చాలా మంది పెద్ద హీరోయిన్స్‌ దగ్గరకు వెళ్లింది. కానీ రష్మికకే రాసిపెట్టి ఉంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూశాక వారం రోజులు నేను ఎవర్నీ కలవలేదు. ఏం సినిమాలు చేస్తున్నాం మనం? అనిపించింది. బాగా డిస్ట్రబ్‌ అయిపోయాను. విజయ్‌కు ఫిల్మ్‌ఫేర్‌ కచ్చితంగా రావాలి, వస్తుంది అనుకున్నాను.

అవార్డ్‌ నామినేషన్స్‌లో ఉన్న హీరోల్లో విజయ్‌ అందరికంటే బాగా  చేశాడు. మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. డాడీ (అల్లు అరవింద్‌) నీ గురించి ఏం చెప్పాలి? బాగా డబ్బులు సంపాదించాలి. నాకు మంచి కార్‌ కొనివ్వు (నవ్వుతూ). నా నెక్ట్స్‌ సినిమా ఏంటో నాకే తెలియదు (అభిమానులను ఉద్దేశిస్తూ). టైమ్‌ పడుతుంది. వెయిట్‌ చేయండి ప్లీజ్‌’’ అన్నారు. ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ – ‘‘బన్నీగారి ముందు మాట్లాడాలంటే టెన్షన్‌గా ఉంది. పరశురామ్‌ ఈ కథ చెప్పినప్పుడు బన్నీగారు ఓ మాట చెప్పారు.

‘100% లవ్‌’ తర్వాత ఆ రేంజ్‌ సక్సెస్‌ అవుతుంది’ అన్నారు. కథకి హీరో ఎవరు అని అలోచిస్తుంటే విజయ్‌ ‘పెళ్లి చూపులు’ రిలీజ్‌ అయింది. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశాక ‘అర్జున్‌ రెడ్డి’ రిలీజ్‌ అయింది. కచ్చితంగా స్టార్‌ అవుతాడు అనుకున్నాను. ఇతనితోనా మనం సినిమా తీయాల్సింది అని కంగారు పడ్డాం.  ఈ సినిమాకు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు గోపీ సుందర్‌’’ అన్నారు .విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నేను పాడిన పాటను విపరీతంగా క్రిటిసైజ్‌ చేశారు. నిద్రపట్టలేదు. మీరెవరైనా పాడి పంపండి.  సినిమాలో పెడతాను.

‘బాబు.. నువ్వు ఆడియో ఫంక్షన్‌లో రచ్చ చేయొద్దు అని మా టీమ్‌ అంతా చెప్పారు (నవ్వుతూ). మా ఫ్రెండ్‌ మా ఇంటికి వస్తుంటే ఆ విజయ్‌తో జాగ్రత్త రా అంటున్నారట. ఈ సినిమా మీ పేరెంట్స్‌ అందరికీ చూపించి నేను మంచోడినే అని చెప్పండి. బన్నీ అన్న ఈ ఆడియోకి నాకోసం రాలేదు. రీసెంట్‌గా సినిమా చూశారట. ఇక్కడికి రావడానికి అది కూడా ఓ కారణం అయ్యుంటుంది’’ అన్నారు.‘‘గీత (సినిమాలో తను చేసిన పాత్ర) మేడమ్‌ నుంచి ఏం నేర్చుకోవాలో తెలియాలంటే అందరూ ఆగస్ట్‌ 15న థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు రష్మిక.

పరశురామ్‌ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ రెండేళ్ల క్రితం స్టార్ట్‌ అయింది. ఈ కథ అరవింద్‌గారికి ఎంత ఇష్టమంటే నన్ను గీతా ఆర్ట్స్‌ నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. రెండేళ్ల నుంచి ఏ సినిమా రావట్లేదేంటి అని చాలామంది అడుగుతున్నారు. మా ఆవిడ కూడా అడిగేది – ‘ఏం చేస్తున్నావు రోజూ ఆఫీస్‌కి వెళ్లి?’ అని! నా రెండేళ్ల ఎఫర్ట్‌ ఈ సినిమా. మా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక ‘అర్జున్‌ రెడ్డి’ సక్సెస్‌ అయింది. విజయ్‌ని ఎలా హ్యాండిల్‌ చేయాలని భయమేసింది. కానీ హిట్‌ ముందు ఎలా ఉన్నాడో తను ఇప్పుడూ అలానే ఉన్నాడు. ఒక్క సీన్, డైలాగ్, ఎక్స్‌ప్రెషన్‌ ఇలానే ఎందుకు? అని అడగలేదు.

నేను చెప్పింది చెప్పినట్టు చేశాడు. అనుకున్నదాని కంటే బాగా చేశాడు. గోపీ సుందర్‌ ఐదు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు’’ అన్నారు.‘‘పరశురామ్‌ ‘శ్రీరస్తు శుభమస్తు’ చేస్తున్నప్పుడు ఈ కథ చెప్పాడు. చాలా బాగా నచ్చింది. నువ్వు వేసిన ముడి బావుంది, దాన్ని విప్పు అన్నాను. ఆ తర్వాత గంట కథ చెప్పాడు. బాగా నచ్చేసి అతన్ని ఆఫీస్‌లోనే కట్టేశాను.‘అర్జున్‌ రెడ్డి’ రిలీజ్‌ తర్వాత కంగారు పడి కలిశాం. ఇతన్ని ఆడియన్స్‌ ఈ క్యారెక్టర్‌లో తీసుకోగలరా? అనిపించింది. విజయ్‌ జెంటిల్‌మేన్‌. మనిషి మంచోడు.

ఏది ఉన్నా ఓపెన్‌గా మాట్లాడతాడు. అదే ట్రెండ్‌ అయిపోయింది. తను బాగా పాడలేదని క్రిటిసైజ్‌ చేస్తే దాన్ని కూడా పబ్లిసిటీగా వాడేశాడు. గోపీ సుందర్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ‘ఇంకేం కావాలే...’ సాంగ్‌ వేరే వాళ్లతో పాడించినది పెడదాం అనుకుంటే ‘వద్దు సిడ్‌ శ్రీరామ్‌ సాంగే కావాలి, అతనిది డిఫరెంట్‌ సౌండింగ్‌. క్లిక్‌ అవుతుంది’ అన్నాడు విజయ్‌. యంగ్‌స్టర్స్‌ అభిప్రాయాలకు విలువ ఇవ్వడమే నా సక్సెస్‌ అనుకుంటున్నాను’’ అన్నారు అల్లు అరవింద్‌.
∙బన్నీ వాసు, అల్లు అరవింద్, పరశురాం, విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా, అల్లు అర్జున్, గోపీ సుందర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top