అమ్మతో అల్లువారి అమ్మాయ్‌

allu arjun-sneha daughter birthday november 21 - Sakshi

నో డౌట్‌... అల్లువారి అమ్మాయి కూడా స్టైలిష్‌ స్టారే! కావాలంటే... ఫొటో కోసం అమ్మ ఒడిలో చక్కగా నిలబడి అమ్మాయి ఇచ్చిన లుక్కుపై ఓ లుక్కేయండి! ఇప్పుడా అమ్మాయి వయసెంతో తెలుసా? జస్ట్‌... ఎలెవన్‌ మంత్స్‌! కానీ, ఆ నవ్వులోనూ... చూపులోనూ... ఎక్స్‌ప్రెషన్‌లోనూ... మంచి స్టైల్‌ ఉన్నట్టుంది కదూ! ఈ నెల 21న అర్హ (అల్లు అర్జున్‌–స్నేహ దంపతుల కుమార్తె) పుట్టినరోజు.

ఈ సందర్భంగా స్పెషల్‌ ఫొటోషూట్‌ చేసినట్టున్నారు. అప్పుడప్పుడూ పిల్లలతో ఇటువంటి స్పెషల్‌ ఫొటోషూట్స్‌ చేసి, సోషల్‌ మీడియాలోని అభిమానులతో పంచుకోవడం అల్లు అర్జున్‌కి అలవాటు. ఈ ఫొటోనూ అదే విధంగా ఫేస్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. అభిమానుల నుంచి ఈ ఫొటోకి విపరీతమైన స్పందన వచ్చింది... ఒక లక్షా డబ్బై వేల రియాక్షన్లు, పన్నెండు వేల షేర్లు, బోల్డన్ని కామెంట్స్‌!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top