అల్లు అర్జున్ డేట్ ఫిక్స్ చేశాడు | allu arjun sarainodu movie first look releasing on january 26th | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ డేట్ ఫిక్స్ చేశాడు

Jan 21 2016 9:58 AM | Updated on Jul 23 2019 11:50 AM

అల్లు అర్జున్ డేట్ ఫిక్స్ చేశాడు - Sakshi

అల్లు అర్జున్ డేట్ ఫిక్స్ చేశాడు

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజలవుతున్నా ఇప్పటి వరకు సినిమాకు సంబందించిన ఒక్క స్టిల్ కూడా బయటి రాలేదు. దీంతో అభిమానులు చాలా రోజులుగా సరైనోడు ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీ ఫుల్ మాస్ క్యారెక్టర్ చేసి చాలా కాలం అవుతుండటంతో ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ను కూడా అఫీషియల్గా ఎనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సంక్రాంతికి టైటిల్తో పాటు బన్నీ లుక్ను కూడా రిలీజ్ చేయాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో వీలైనంత త్వరగా సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. సంక్రాంతి సీజన్ మిస్ కావటంతో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, ఆది పినిశెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తరువాత బన్నీ తన సొంతం నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలను భారీగా పెంచేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement