గమ్మునుండవోయ్‌ | Allu Arjun Launching Own Production House | Sakshi
Sakshi News home page

గమ్మునుండవోయ్‌

Dec 20 2017 12:11 AM | Updated on Dec 20 2017 12:11 AM

Allu Arjun Launching Own Production House  - Sakshi

‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి చెప్పిన డైలాగ్‌ ఇది. పిల్లలకు, పెద్దలకు గోన గన్నారెడ్డి అలియాస్‌ అల్లు అర్జున్‌ ఓ వెరైటీ స్టైల్‌లో చెప్పిన ఈ డైలాగ్‌ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడీ డైలాగ్‌ని గుర్తు చేయడానికి కారణం ఉంది. ఫిల్మ్‌ నగర్‌లో బన్నీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సొంత బేనర్‌ పెట్టి, బన్నీ ప్రొడ్యూసర్‌ కావాలనుకుంటున్నాడన్నది ఆ వార్త సారాంశం. నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో తీయడానికి రెడీ అయిపోయాడని కూడా చెప్పుకుంటారు.

నిజమేనా బాసూ? అని అడిగితే.. ‘గమ్మునుండవోయ్‌’ అని ఫిల్మ్‌నగర్‌లో ఓ వర్గం అంటోంది. తండ్రి అల్లు అరవింద్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తోన్న గీతా ఆర్ట్స్, భాగసామ్యంలో నడిపిస్తోన్న ‘జీఏ2’, ‘వి4’.. ఇన్ని బేనర్లు ఉండగా బన్నీ ఇంకో కొత్త బేనర్‌ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటున్నారు. పాయింటే కదా. బన్నీ సన్నిహిత వర్గాలు కూడా ‘ఇది గాసిప్‌’ అని తేల్చేశాయి. సో.. బన్నీ సొంత బేనర్‌ పెట్టడంలేదు. భవిష్యత్తులో నిర్మాత అవ్వాలనుకుంటే ‘జీఏ2’ బేనర్‌ మీద నిర్మించాలనే ఆలోచన ఉందట. అప్పటివరకూ గమ్మునుందాం.

Advertisement
 
Advertisement
Advertisement