రీమేక్ సినిమాలో మరో మెగా హీరో | Allu Arjun In A Tamil Remake Kanithan | Sakshi
Sakshi News home page

రీమేక్ సినిమాలో మరో మెగా హీరో

Feb 28 2016 9:10 AM | Updated on Sep 3 2017 6:37 PM

రీమేక్ సినిమాలో మరో మెగా హీరో

రీమేక్ సినిమాలో మరో మెగా హీరో

మెగా హీరోలందరూ రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్ను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు.

మెగా హీరోలందరూ రీమేక్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్ రీమేక్ను సెట్స్ మీదకు తీసుకువచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రీమేక్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. విజయ్ హీరోగా ఘనవిజయం సాధించిన కత్తి సినిమాను వినాయక్ దర్శతక్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు.

ఇప్పుడు ఈ లిస్ట్లో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా చేరనున్నాడట. ఇటీవల తమిళ్లో ఘనవిజయం సాధించిన కనిథన్ రీమేక్లో నటించడానికి బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అధర్వ, కేథరిన్ థెరిస్సాలు జంటగా తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను బాలీవుడ్లోనూ రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో అర్జున్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలు లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 22న రిలీజ్కు రెడీ అవుతోంది. సరైనోడు సినిమా రిలీజ్ తరువాత కనీథన్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement