గణపతి బప్పా మోరియా | Allu Arjun Family Ganesh Nimajjanam Celebrations | Sakshi
Sakshi News home page

గణపతి బప్పా మోరియా

Sep 24 2018 12:39 AM | Updated on Sep 24 2018 12:39 AM

Allu Arjun Family Ganesh Nimajjanam Celebrations - Sakshi

కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్‌

కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌కి బ్రేక్‌ తీసుకుంటున్నారు అల్లు అర్జున్‌. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. కొత్త సినిమా కథలూ వింటున్నారు. పిల్లలతో ఎక్కువ టైమ్‌ ఆటలు ఆడుకుంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈవెంట్స్‌తో గడుపుతున్నారు. వినాయక చవితి సందర్భంగా ఫ్యామిలీ అందరితో కలిసి వినాయకుడి పూజల్లో నిమగ్నమైపోయారు అల్లు అర్జున్‌.

కుటుంబంతో సహా వినాయకుడ్ని దర్శించుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో అదే. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత హడావిడిగా సినిమా సైన్‌ చేయలేదు అల్లు అర్జున్‌. కథలు వింటున్నారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కే కుమార్‌తో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ఉండబోతోందని, లేదు లేదు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నెక్ట్స్‌ అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement