17 ఏళ్లు... 20 సినిమాలు | Allu Arjun completes 17 years in Telugu film industry | Sakshi
Sakshi News home page

17 ఏళ్లు... 20 సినిమాలు

Mar 29 2020 12:47 AM | Updated on Mar 29 2020 12:47 AM

Allu Arjun completes 17 years in Telugu film industry - Sakshi

కుమారుడు అయాన్, కుమార్తె అర్హలతో అల్లుఅర్జున్‌

ఇటీవలే ‘అల..వైకుంఠపురములో...’తో సూపర్‌సక్సెస్‌ అందుకున్నారు అల్లు అర్జున్‌ (బన్ని). ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం చిత్తూరు యాసపై పట్టు సాధించే పనిలో బిజీగా ఉన్నారు బన్ని. ఇది తన కెరీర్‌లో 20వ చిత్రం. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. అలాగే బన్నీ సినీ కెరీర్‌లో 17 సంవత్సరాలు ముగిశాయి. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్‌.

ఆ తర్వాత ‘ఆర్య’, ‘దేశముదురు’, ‘పరుగు’, జులాయి, రేసుగుర్రం, సరైనోడు’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో ఇండస్ట్రీలో తనదైన ప్రతిభను చాటుకున్నారు. ‘‘పదిహేడేళ్లుగా నన్ను సపోర్ట్‌ చేస్తున్న ప్రేక్షకులకు, నా అభిమానులకు రుణపడి ఉంటాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు, అశ్వనీదత్, అల్లు అరవింద్‌ గార్లతో పాటు ‘గంగోత్రి’ టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు అల్లుఅర్జున్‌. అలాగే ఈ 17ఏళ్ల కెరీర్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు స్నేహా రెడ్డి (అల్లు అర్జున్‌ భార్య).
 

Advertisement
 
Advertisement
Advertisement