అందుకే నాని అంటే చాలా ఇష్టం : అల్లు అర్జున్ | Allu arjun at Bhale Bhale Magadivoy movie audio launch | Sakshi
Sakshi News home page

అందుకే నాని అంటే చాలా ఇష్టం : అల్లు అర్జున్

Aug 16 2015 11:10 PM | Updated on Sep 3 2017 7:33 AM

అందుకే నాని అంటే చాలా ఇష్టం : అల్లు అర్జున్

అందుకే నాని అంటే చాలా ఇష్టం : అల్లు అర్జున్

ఈ సినిమాలో హీరోకు మతిమరుపు ఉంటుంది. దాన్ని చాలా అందంగా కవర్ చేసుకుంటాడు హీరో. మానవత్వం ఉన్న క్యారెక్టర్ అతనిది.

‘‘ఈ సినిమాలో హీరోకు మతిమరుపు ఉంటుంది. దాన్ని చాలా అందంగా కవర్ చేసుకుంటాడు హీరో. మానవత్వం ఉన్న క్యారెక్టర్ అతనిది. నాని హీరోగా ఈ సినిమా చేద్దామంటే, మంచి నటుడు కాబట్టి సరేనన్నా’’ అని నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. నాని, లావణ్యా త్రిపాఠి జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. గోపీసుందర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని అల్లు అర్జున్ ఆవిష్కరించారు.
 
 అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ -‘‘నాకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్స్ అంటే గౌరవం. అలాంటి పాత్రలు చేసే నాని అంటే ఇష్టం. అతని కామెడీ టైమింగ్, తెలుగు యాక్సెంట్, సినిమా మీద ఉన్న సెన్సిబిలిటీస్ సూపర్. నా ఫ్రెండ్ మారుతి ఈ సినిమా బాగా తీశాడని అనుకుంటున్నా’’ అన్నారు. నాని మాట్లాడుతూ -‘‘మా దారి ఎంటర్‌టైన్‌మెంట్ దారి. రెండు గంటలు హాయిగా నవ్విస్తాం.
 
 మారుతీగారు సిద్ధమంటే ‘బీబీఎం2’ కూడా అనౌన్స్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నా ఒరిజినల్ క్యారెక్టర్‌ను బేస్ చేసుకుని ఈ కథ తయారు చేశాను. మంచి పెర్ఫార్మర్ కావాలనుకున్నప్పుడు నాకు మొదట నాని గుర్తుకు వచ్చాడు’’ అని మారుతి చెప్పారు. చిత్ర కథానాయిక లావణ్యా త్రిపాఠి, దర్శకులు బాబీ, పరశురామ్, నిర్మాతలు శరత్ మరార్, ‘మల్టీ డైమన్షన్’ వాసు, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement