నాన్న.. నేను?

Allu Arjun and Trivikram Movie Titled As Nanna Nenu - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తారు. ఇందులో పూజాహెగ్డే, క్యాథరీన్‌ కథానాయికలుగా నటిస్తారని టాక్‌. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రానికి ‘నాన్న.. నేను’ అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోందని ప్రచారం జరగుతోంది. తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుందట.

ఇంతకుముందు అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలోనూ ఫాదర్‌ సెంటిమెంట్‌ ఉంటుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top