వెరైటీ కాన్సెప్ట్‌

 Allari Naresh New Movie With Vijay Kanakamedala - Sakshi

కామెడీ హీరోగా ‘అల్లరి’ నరేశ్‌ది ఓ ప్రత్యేకమైన స్థానం. హీరోగా చేస్తున్నప్పటికీ కథ, పాత్ర నచ్చడంతో మహేశ్‌బాబు హీరోగా రూపొందిన ‘మహర్షి’ సినిమాలో నరేశ్‌ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. మంచి ఎమోషన్‌ ఉన్న ఈ పాత్రలో నరేశ్‌ నటన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ‘బంగారు బుల్లోడు’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారాయన.

ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. మరోవైపు ఓ వెరైటీ కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రం అంగీకరించారు నరేశ్‌. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దగ్గర కో–డైరెక్టర్‌గా చేసిన విజయ్‌ కనకమేడల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘ఒక్క క్షణం’ చిత్రాలకు కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సతీష్‌ వేగేశ్న నిర్మాతగా మారి, ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top