వినోదంలో కొత్తకోణం

వినోదంలో కొత్తకోణం

 ‘వీడు తేడా’ ఫేమ్ చిన్ని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈవీవీ సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమిల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ కెమెరా స్విచాన్ చేయగా, ఆర్యన్ రాజేష్ క్లాప్ ఇచ్చారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ -‘‘ ‘బొమ్మన బ్రదర్స్-చందన సిస్టర్స్’ తర్వాత మా సంస్థలో చేస్తున్న సినిమా ఇది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టి, మే నెలలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. వినోదంలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తామని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: అడుసుమిల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్: గౌతంరాజు.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top