ఆలిండియన్‌ స్టార్‌ | all india fame to prabhas | Sakshi
Sakshi News home page

ఆలిండియన్‌ స్టార్‌

Oct 23 2017 6:46 AM | Updated on Oct 23 2017 6:46 AM

all india fame to prabhas

‘బాహుబలి’లో దేవసేనను సంకెళ్లతో బంధిస్తాడు భల్లాలదేవ. తెరపైన ముచ్చటిది!! మరి, తెరవెనుక? ప్రభాస్‌ను రాజమౌళి బంధించారు. లేదు లేదు... కథే ‘బాహుబలి’కి ప్రభాస్‌ను బంధీని చేసింది! కథను నమ్మారు. ఐదేళ్ల పాటు తనకు తానుగా మాహిష్మతి సామ్యాజ్యంలో బంధీగా ఉన్నారు. కట్‌ చేస్తే... సినిమా విడుదలైంది. భారీ అంటే భారీ హిటై్టంది. హిందీ ప్రముఖులు, ప్రేక్షకులు తెలుగు చిత్రసీమవైపు చూశారు. అభిమానుల గుండెల్లో ప్రభాస్‌ ఇమేజ్‌ ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు పెరిగింది. కట్‌ చేస్తే... ‘బాహుబలి–2’ వచ్చింది. ఈసారి అంతర్జాతీయ ప్రేక్షకులూ, సినీ ప్రముఖులూ మన తెలుగువైపు చూశారు. హిందీ వాళ్లైతే... ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ప్రభాస్‌ నటననూ, సినిమా వసూళ్లనూ చూసి! ఈసారి ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టు ప్రభాస్‌ ఇమేజ్‌ పెరగలేదు! ఎందుకంటే... ఆ అవకాశం ఇవ్వకుండా ప్రేక్షకులు, అభిమానులు తమ గుండెల్లో అతణ్ణి బంధీ చేసేసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్‌ తెలుగులో మాత్రమే హీరో కాదు. ఆలిండియన్‌ హీరో! ఇంటర్నేషనల్‌గా మంచి పేరున్న హీరో. అందుకే, బ్యాంకాక్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో అతని మైనపు బొమ్మను ప్రతిష్టించారు. ఇకపై అతను నటించే సినిమాలన్నీ బహు భాషల్లో విడుదల కానున్నాయి. అటువంటి ప్రభాస్‌ పుట్టినరోజు ఈ రోజే. ఈ సందర్భంగా ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘సాహో’ ఫస్ట్‌ లుక్, మేకింగ్‌ వీడియోలను ఈ రోజు ఉదయం 9.30 గంటలకు విడుదల చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement