అధరహో...! | Alia Bhatt lip lock with Shahid Kapoor | Sakshi
Sakshi News home page

అధరహో...!

Oct 16 2014 11:15 PM | Updated on Apr 3 2019 6:23 PM

అధరహో...! - Sakshi

అధరహో...!

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్ అనగానే... టకీమని ఇమ్రాన్ హష్మీ గుర్తొస్తారు. ఆయన ప్రతి సినిమాలోనూ దాదాపు లిప్ లాక్ ఉండాల్సిందే. అదే పంథాలో ముందుకెళ్తున్నారు బాలీవుడ్ భామ అలియా భట్.

 బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్ అనగానే... టకీమని ఇమ్రాన్ హష్మీ గుర్తొస్తారు. ఆయన ప్రతి సినిమాలోనూ దాదాపు లిప్ లాక్ ఉండాల్సిందే. అదే పంథాలో ముందుకెళ్తున్నారు బాలీవుడ్ భామ అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హైవే, 2 స్టేట్స్, హమ్టీ శర్మాకీ దుల్హనియా...  ఇప్పటివరకూ ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించింది ఈ  నాలుగు సినిమాలే. ఈ నాలుగింటిలోనూ తాను జతకట్టిన కథానాయకులతో లిప్ కిస్‌లను లాగించేసింది అలియా. అందుకే... ప్రస్తుతం అలియాను బాలీవుడ్‌లో అందరూ లేడీ ఇమ్రాన్ హష్మీ అని పిలుస్తున్నారు. ఇదిలా వుంటే... ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమా ‘షాన్‌దార్’. షాహిద్‌కపూర్ ఇందులో కథానాయకుడు.
 
 ఈ సినిమా షూటింగ్  మొదలైనప్పట్నుంచీ... ‘ఈ దఫా అలియా అధరాలను అందుకునే అదృష్టశాలి షాహిద్’ అంటూ మీడియాలో కథనాలు ప్రసారమవ్వడం మొదలయ్యాయి. దీనికి తగ్గట్టే దర్శకుడు వికాశ్‌బాల్ కూడా ఈ సినిమాలో ‘అధర’హో అనిపించేలా కిస్సింగ్ సీన్ ప్లాన్ చేశారట. అది కూడా సాదాసీదా కిస్సింగ్ సీన్ కాదని సమాచారం. ఇప్పటివరకూ అలియా చేసిన లిప్‌లాక్‌లను తలదన్నే స్థాయిలో ఈ సీన్ ఉంటుందని వినికిడి. కథ గమనానికి ఈ లిప్‌లాక్ చాలా అవసరమవ్వడం వల్లే... దర్శకుడు ఈ సీన్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement