నా ఫస్ట్ నైట్...వాళ్లకు అంకితం! | Alia Bhatt about her first night | Sakshi
Sakshi News home page

నా ఫస్ట్ నైట్...వాళ్లకు అంకితం!

Oct 21 2016 11:46 PM | Updated on Sep 4 2017 5:54 PM

నా ఫస్ట్ నైట్...వాళ్లకు అంకితం!

నా ఫస్ట్ నైట్...వాళ్లకు అంకితం!

కొత్త ఇల్లు.. కొత్త కాపురం.. పెళ్లికి ముందే ప్రముఖ హిందీ దర్శకుడు మహేశ్ భట్ ముద్దుల కూతురు ఆలియా భట్ వేసిన ప్లాన్

కొత్త ఇల్లు.. కొత్త కాపురం.. పెళ్లికి ముందే ప్రముఖ హిందీ దర్శకుడు మహేశ్ భట్ ముద్దుల కూతురు ఆలియా భట్ వేసిన ప్లాన్ అదుర్స్ అంటున్నారు ముంబై జనాలు. సిస్టర్ షహీన్‌తో కలసి తల్లిదండ్రులకు కాస్త దూరంగా ఆలియా వేరే ఇంట్లోకి మకాం మార్చనున్నారనే మాట ఎప్పట్నుంచో వింటున్నాం. ఇప్పుడా మాట నిజం కాబోతోంది. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లోకి త్వరలోనే అక్కాచెల్లెళ్ల్లు ఆలియా, షహీన్‌లు అడుగు పెట్టనున్నారు. గృహ ప్రవేశం రోజున, ఆ రాత్రి ఏం చేయాలో.. ఇప్పుడే ప్లాన్ చేసేశారు.


 ‘‘ద ఫస్ట్ నైట్ ఇన్ ద న్యూ హౌస్ విల్ బి డెడికేటెడ్ టు మై పేరెంట్స్’’ అని ఆలియా భట్ స్పష్టం చేశారు. కొత్త ఇంట్లో తొలి రాత్రిని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చేస్తారట. గృహ ప్రవేశం రోజు రాత్రి అమ్మానాన్నలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని చెబుతున్నారు. ‘‘నా జీవితంలో ఆ ఫస్ట్ నైట్ (అదేనండీ.. కొత్తగా కట్టుకున్న ఇంట్లో తొలిరాత్రి) చాలా ముఖ్యమైన వేడుక. అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటాననే అనుకుంటున్నా’’ అన్నారు ఆలియా. ఇరవై మూడేళ్లకు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు సొంతంగా ఇల్లు కొనుక్కున్న ఆలియాను ముంబై జనాలు అభినందిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement