అల.. కొత్తింట్లో... | Ala vaikunta puram lo shooting restarted | Sakshi
Sakshi News home page

అల.. కొత్తింట్లో...

Aug 22 2019 3:04 AM | Updated on Aug 22 2019 9:35 AM

Ala vaikunta puram lo shooting restarted - Sakshi

అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ కొత్త ఇంటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక అడుగుపెట్టడమే ఆలస్యం. ఇంతకీ ఇది సినిమా ఇల్లు అన్నమాట. త్రివిక్రమ్‌ హీరోగా అల్లు అర్జున్‌ హీరోగా ‘అల.. వైకుంఠపురములో...’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే ఇంటి సెట్‌ వేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. చిన్న బ్రేక్‌ తీసుకున్న చిత్రబృందం గురువారం నుంచి మళ్లీ షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉందని సమాచారం.

ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ కోసమే భారీ హౌస్‌ సెట్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో డిజైన్‌ చేయించారని తెలిసింది. సినిమా టైటిల్‌ లోగోలో ఓ పెద్ద భవనం కనిపిస్తున్న విషయం తెలిసిందే. కీలక సన్నివేశాలన్నీ ఈ ఇంటి సెట్‌లో తీస్తారని ఊహించవచ్చు. సినిమాలో టబు, జయరామ్‌ల కొడుకుగా అల్లు అర్జున్‌ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. సుశాంత్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రధారులు. ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement