అక్షయ్‌, సల్మాన్‌లకు చోటు ; షారుక్‌ మిస్‌ | Akshay Kumar And Salman Khan In Forbes Paid Entertainers List | Sakshi
Sakshi News home page

అక్షయ్‌, సల్మాన్‌లకు చోటు ; షారుక్‌ మిస్‌

Jul 17 2018 3:49 PM | Updated on Jul 17 2018 4:18 PM

Akshay Kumar And Salman Khan In Forbes Paid Entertainers List - Sakshi

న్యూయార్క్‌ : ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాను ప్రముఖ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌లు చోటు దక్కించుకున్నారు. గతేడాది షారుక్‌ ఖాన్‌  ఈ జాబితాలో 65వ స్థానంలో నిలువగా ఈసారి మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. 2017 జూన్‌ 1 నుంచి 2018 జూన్‌ 1 మధ్య కాలంలో ప్రముఖల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. టాప్‌ 100లోని సెలబ్రిటీలు చెల్లించే ముందస్తు పన్నుల విలువ 22 శాతం పెరిగినట్టు పేర్కొంది.

ఈ జాబితాలో అక్షయ్‌ రూ. 276 కోట్లతో 76వ స్థానంలో నిలువగా, సల్మాన్‌ రూ. 257 కోట్లతో 82వ స్థానంలో నిలిచారు. అమెరికన్‌ బాక్సర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌ 1946 కోట్లతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలువగా, యాక్టర్‌ జార్జ్‌ క్లూనీ 2వ స్థానంలో, అమెరికన్‌ మోడల్‌ కైలీ జెన్నర్‌ 3వ స్థానంలో, ఫుట్‌బాల్‌ ప్లేయర్స్‌ లియోనల్‌ మెస్సీ 8వ స్థానంలో, క్రిస్టియానో రొనాల్డో 10వ స్థానంలో నిలిచారు. కాగా క్రితం ఏడాది ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో భారత్‌ నుంచి  షారుక్‌ రూ.245 కోట్లతో 65వ స్థానంలో, సల్మాన్‌ రూ.238 కోట్లతో 71వ స్థానంలో, అక్షయ్‌ రూ.228 కోట్లతో 80వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement