ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది – నాగార్జున | akkineni akhil second movie started today | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది – నాగార్జున

Apr 2 2017 11:31 PM | Updated on Jul 15 2019 9:21 PM

ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది   – నాగార్జున - Sakshi

ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది – నాగార్జున

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించబోయే రెండో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా?

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించబోయే రెండో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానుల నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పడింది. అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా ఆదివారం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెమేరా స్విచ్ఛాన్‌ చేయగా, ఏయన్నార్‌ ముని మనవరాళ్లు సత్య, సాగరి క్లాప్‌ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజస్‌ సంస్థలపై రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ నేటి నుంచి మొదలవుతుంది.

‘‘మనం’ టెక్నికల్‌ టీమ్‌ వర్క్‌ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది’’ అన్నారు నాగర్జున. ‘‘డిఫరెంట్‌ కమర్షియల్‌ సినిమా ఇది. క్లాసిక్‌ హిట్‌ ‘మనం’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో మళ్లీ ఓ మంచి సినిమా చేస్తుండడం హ్యాపీగా ఉంది’’ అన్నారు విక్రమ్‌ కుమార్‌. యార్లగడ్డ సురేంద్ర, అమల, సుప్రియ, సుమంత్, నాగచైతన్య, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, ఆర్ట్‌: రాజీవన్, కెమేరా: పి.ఎస్‌. వినోద్, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement