ప్రయోగానికి రెడీ అంటున్న అఖిల్ | akkineni akhil next film in krish direction | Sakshi
Sakshi News home page

ప్రయోగానికి రెడీ అంటున్న అఖిల్

Oct 23 2015 10:50 AM | Updated on Sep 3 2017 11:22 AM

ప్రయోగానికి రెడీ అంటున్న అఖిల్

ప్రయోగానికి రెడీ అంటున్న అఖిల్

తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో అఖిల్. అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్...

తొలి సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఫాలోయింగ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో అఖిల్. అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం తన తొలి సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకపోయిన అఖిల్ చేయబోయే తరువాత ప్రాజెక్ట్స్ పై రకరకాల వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్లు అఖిల్తో సినిమాకు రెడీ అంటూ టాక్ వినిపిస్తున్న నేపధ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ జానర్కు దూరంగా డిఫరెంట్ టేకింగ్తో సినిమాలను తెరకెక్కించే క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయనున్నాడట. అల్లు అర్జున్, రానా, అల్లరి నరేష్, మనోజ్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసిన క్రిష్, తాజాగా వరుణ్ తేజ్ హీరోగా కంచె సినిమాను తెరకెక్కించాడు.

వినాయక్ దర్శకత్వంలో, నితిన్ నిర్మాతగా తెరకెక్కించిన అఖిల్, ఈ దసరాకు రిలీజ్ కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా రిజల్ట్ చూసిన తరువాతే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాడు అక్కినేని వారసుడు.

Advertisement
 
Advertisement
Advertisement