'అఖిల్' వాయిదా | Akkineni akhil first movie akhil postponed | Sakshi
Sakshi News home page

'అఖిల్' వాయిదా

Oct 16 2015 9:53 AM | Updated on Sep 3 2017 11:04 AM

'అఖిల్' వాయిదా

'అఖిల్' వాయిదా

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా 'అఖిల్'. మాస్ స్పెషలిస్ట్ వివి వినాయక్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న...

అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా 'అఖిల్'. మాస్ స్పెషలిస్ట్ వివి వినాయక్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా దసరాకు రిలీజ్ కావటం లేదు.

గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న అఖిల్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అఖిల్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో త్వరగా పని పూర్తిచేసి రిలీజ్ చేయడం కన్నా, పూర్తి క్వాలిటీతో రిలీజ్ చేయాలని భావించిన యూనిట్.., ఆలస్యం అయినా గ్రాఫిక్స్ క్వాలిటీ బాగా వచ్చాకే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

యంగ్ హీరో, అఖిల్ సినిమా నిర్మాత నితిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో ప్రకటించారు. 'గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అయిన కారణంగా అనుకున్న సమయానికి అఖిల్ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం, కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం.. సారీ ' అంటూ తన ట్విట్టర్ లో అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement