ఎక్కడుంటాడు? | Akkadokaduntadu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఎక్కడుంటాడు?

Feb 1 2019 2:34 AM | Updated on Jul 12 2019 4:40 PM

Akkadokaduntadu Movie Audio Launch - Sakshi

శివ కంఠంనేని

శివ కంఠంనేని టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్‌ కార్తీక్, శివ హరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరో, హీరోయిన్లుగా, రవిబాబు, వినోద్‌ కుమార్, ఇంద్రజ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వంలో కె. శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్‌ ఈ చిత్రం ఆడియో సీడీలను విడుదల చేసి, నిర్మాత సి. కల్యాణ్‌కి ఇచ్చారు.

‘‘అక్కడొకడుంటాడు.. ఎక్కడుంటాడు? ఎందుకుంటాడు? అనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది’’ అని శివ కంఠంనేని అన్నారు. ‘‘కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమిది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు శ్రీపాద విశ్వక్‌.  ‘‘పైరసీలో కాకుండా థియేటర్లో చూస్తేనే మా సినిమా సాంకేతికంగా ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. ‘అల్లరి’ రవిబాబు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement