ఫారిన్‌ ప్రయాణం

Akhil's New Movie Shooting In Paris - Sakshi

ప్రేయసితో ఆటా పాటా, విలన్ల తాట తీయనున్నారు అఖిల్‌. దీనికోసం విదేశాలు వెళ్లారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఫారిన్‌లో జరగనుందని సమాచారం. సౌదీ అరేబియాలో షూటింగ్‌ ప్లాన్‌ చేశారట. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్, పాటను చిత్రీకరించబోతున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌ దాదాపు పది రోజులు సాగుతుందట. జీఎ2 పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్‌ స్వరకర్త.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top