విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో? | Akhil wary of announcing Vikram Kumar movie | Sakshi
Sakshi News home page

విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో?

Aug 16 2016 11:20 PM | Updated on Sep 4 2017 9:31 AM

విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో?

విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో?

కథ రెడీ... ఇక షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. సినిమా పరిశ్రమలో ఇది చాలా సహజం.

 కథ రెడీ... ఇక షూటింగ్ మొదలుపెట్టడమే ఆలస్యం అనుకున్న తరుణంలో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. సినిమా పరిశ్రమలో ఇది చాలా సహజం. ఇటీవల అఖిల్ సినిమా విషయంలో ఇలానే జరిగింది. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో అఖిల్ తన రెండో సినిమా చేయాలనుకున్నారు. కానీ, ఇటు అఖిల్ అటు హను రాఘవపూడి వేరు వేరు బేనర్లకు కమిట్‌మెంట్ ఇవ్వడంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందాల్సిన సినిమా వాయిదా పడింది. దాంతో అఖిల్ రెండో సినిమాకి దర్శకుడెవరు? అనే చర్చ మళ్లీ  మొదలైంది.
 
 ఈ చర్చల్లో ప్రధానంగా దర్శకుడు విక్రమ్‌కుమార్ పేరు వినిపిస్తోంది. అక్కినేని కుటుంబం ఎప్పటికీ గర్వంగా చెప్పుకోదగ్గ ‘మనం’లాంటి ఫీల్‌గుడ్ మూవీని అందించిన విక్రమ్‌కుమార్ అంటే నాగార్జునకు ప్రత్యేకమైన అభిమానం ఉండటం సహజం. అక్కినేని కుటుంబం అంటే విక్రమ్‌కి కూడా మంచి అభిమానం ఉంది.
 
 యాక్చువల్‌గా ‘మనం’ తర్వాత మళ్లీ విక్రమ్‌కుమార్‌తో తన కుటుంబానికి చెందిన హీరోల్లో ఎవరో ఒకరితో సినిమా చేయాలన్నది నాగ్ ఆకాంక్ష అనే వార్త వినిపించింది. అప్పుడే అఖిల్ కోసం మంచి కథ రెడీ చేయమని విక్రమ్‌కుమార్‌ని నాగ్ కోరారని ఫిల్మ్‌నగర్ టాక్. సో.. అఖిల్ రెండో సినిమా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ  ఇంకెంత మంది దర్శకులు పేర్లు వినిపిస్తాయో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement