హల్లో... ఓ చిన్న సర్‌ ప్రైజ్‌

Akhil tweet about Hello Surprise  - Sakshi

సాక్షి, సినిమా : అక్కినేనివారి యంగ్ హీరో అఖిల్‌ ప్రస్తుతం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తన రెండో చిత్రం హల్లో షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. స్వయంగా నాగ్‌ దగ్గరుండి మరీ అఖిల్‌ విషయంలో మరోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

వెరైటీగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ తర్వాత ఈ మధ్యే కొన్ని ఆన్‌ లోకేషన్‌ ఫోటోలు విడుదల కావటం చూశాం. ఇక ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణం ఎక్కడిదాకా వచ్చిందో చెబుతూ రేపు అంటే మంగళవారం ఓ చిన్న సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారంట. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా తన ట్విట్టర్‌ లో కాసేపటి క్రితం తెలియజేశాడు. అంతేకాదు డిసెంబర్‌ 22నే చిత్రం రిలీజ్‌ అవుతుందంటూ మరోసారి గట్టిగా చెబుతూ చివరల్లో యాష్‌ ట్యాగ్ కూడా పెట్టేశాడు. 

అయితే నాగ్ వాయిస్‌ ఓవర్‌తో ఓ చిన్న టీజర్‌ లాంటి బిట్‌ను వదిలే ఛాన్స్‌ ఉందని.. అదే సర్‌ప్రైజ్‌ అని ఫిల్మ్ నగర్‌ టాక్. అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అనూప్‌ స్వరాలను అందిస్తున్నాడు. 

Back to Top