అఖిల్ రూపంలో ఏయన్నార్ మన మధ్యలోనే ఉన్నారు : మహేశ్‌బాబు

అఖిల్ రూపంలో ఏయన్నార్ మన మధ్యలోనే ఉన్నారు : మహేశ్‌బాబు


‘‘‘మనం’ సినిమా చూశాక, నాగార్జునగారికి ఫోన్ చేసి అఖిల్ తెరపై వెలిగిపోయాడని చెప్పాను. అతనికి టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. మన తెలుగు సినిమాకు మరో పెద్ద హీరో వచ్చాడు’’ అని మహేశ్‌బాబు అన్నారు. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నిఖితారెడ్డి సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తున్న చిత్రం ‘అఖిల్’. సాయేషా సైగల్ కథానాయిక. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా తనయుడు అఖిల్ తొలి చిత్రం ఆడియో వేడుకను జరపాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆదివారం ‘అఖిల్’ ఆడియో వేడుకను పలువురు సినీ రంగ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిపారు.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ కిక్ల్ చేయండి)



ఈ చిత్రం ఆడియో సీడీని నాగార్జున ఆవిష్కరించగా, మహేశ్‌బాబు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ- ‘‘ఏఎన్నార్ లివ్స్ ఆన్. ఆయన అఖిల్ రూపంలో మనముందున్నారు. ఆయన ఎక్కడున్నా గర్వపడతారు’’ అని చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ- ‘‘నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా ‘అఖిల్’ ఆడియో లాంచ్‌కు వచ్చిన అందరికీ నా థ్యాంక్స్. అఖిల్ అంత బాగా కనడుతున్నాడంటే దాని వెనుక చాలా మంది కృషి ఉంది. కృష్ణగారి వారసుడు నా వారసుడి ఆడియో లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యువతరాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మహేశ్‌బాబుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నాను. మన బంధం (అభిమానులతో) 75 సంవత్సరాల క్రితం మొదలయింది.

 

అఖిల్‌ను సునామీ కెరటం మీద పైకి ఎక్కించి తీసుకెళుతున్నారు. నాన్నగారు నా జేబు వెనక గుండె లో ఎప్పుడూ ఉంటారు. మీ ఆనందంలో నాన్నగారిని చూసుకుంటూ ఉంటాం. సాయేషాకు ఆల్ ద  బెస్ట్. నితిన్‌కు థ్యాంక్స్. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు.  ‘‘8 నెలల క్రితం బ్లాక్‌బస్టర్‌తో వస్తానన్నా. అదే ఈ సినిమా. ఓ వీడియో బైట్ కోసం నేను మహేశ్‌బాబుగారికి ఫోన్ చేశాను. కానీ ఆయనే స్వయంగా వస్తానన్నారు. నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మహేశ్‌బాబుగారికి స్పెషల్ థ్యాంక్స్. వీవీ వినాయక్‌గారు నన్ను  కొడుకుగా, ఓ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. ‘నెక్ట్స్ సినిమా కూడా నేను మీతో (వినాయక్) నే చేస్తాను. మీరు మాట కూడా ఇచ్చారు.

 

నన్ను లాంచ్ చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. నా ముందు వినాయక్‌గారు, నా వెనక మా నిర్మాత సుధాకర్ రెడ్డిగారు ఉన్నారన్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ సినిమా చేశాను. నితిన్ నా కాలర్ పట్టుకుని ఈ సినిమా చేసి ఫ్యాన్స్‌కు బ్లాక్ బస్టర్ ఇవ్వమని అడిగాడు’’ అని అఖిల్ చెప్పారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ-‘ ‘ఈ సినిమా హిట్ అవుతుందని ముందు  నాగార్జునగారికి ప్రామిస్ చేశాను. అఖిల్ కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడు. బ్యాక్‌బోన్‌గా నిలిచిన సుధాకర్‌రెడ్డిగారికి థ్యాంక్స్.  ఈ సినిమా అంత బాగా వచ్చిందంటే అదంతా ఆయన కష్టమే’’ అన్నారు. కథానాయిక సాయేషా మాట్లాడుతూ- ‘‘అఖిల్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డాన్స్, ఫైట్స్ అన్నీ అదరగొట్టాడు.

 

ఏఎన్నార్‌గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. వీవీ వినాయక్‌గారు చాలా ఓపిగ్గా, నాకు నటనలో మెలకువలు నేర్పారు. ఆయన ఎప్పటికీ నా గురువు’’ అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ - ‘‘అక్కినేని ఫ్యాన్స్‌కి, మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్.   మా బ్యానర్‌ను, వినయ్‌గారిని నమ్మినందుకు చాలా థ్యాంక్స్. మీకిచ్చిన (అభిమానులు) ప్రామిస్‌ను ఫుల్‌ఫిల్ చేశామనే అనుకుంటున్నాం. అఖిల్ మెచ్యూరిటీ, కాన్ఫిడెన్స్ లెవల్స్ సూపర్. ఫస్ట్ సినిమాకే చాలా క్లారిటీతోనే ఉన్నాడు. అఖిల్ కాలికి ఓ ఫైట్‌లో దెబ్బ తగిలింది. ఆ తర్వాత రోజు చేయాల్సిన  పాటను వాయిదా వేయకుండా నొప్పి ఉన్నా సరే డ్యాన్స్ చేశాడు. ఇంత కమిట్‌మెంట్‌తో ఉంటే అతను మంచి హైట్స్‌కు వెళతాడు’’ అన్నారు.

 

అఖిల్‌కు అతిరథ మహారథుల విషెస్



అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, వెంకటేశ్, ప్రభాస్, రానా, అలాగే క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తమిళ హీరో సూర్య, శ్రుతీహాసన్ ఇలా పలువురు ప్రముఖులు వీడియో బైట్స్ ద్వారా అఖిల్‌కు తమ విషెస్ అందజేశారు. ఈ వేడుకలో సుమంత్, సుశాంత్, నాగసుశీల, నిమ్మగడ్డ ప్రసాద్, కొరటాల శివ, నాగచైతన్య, రచయిత కోనా వెంకట్, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, గేయ రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top