అఖిల్.. 'సూర్య కవచం' | Akhil movie tamil title surya kavacham | Sakshi
Sakshi News home page

అఖిల్.. 'సూర్య కవచం'

Oct 11 2015 11:18 AM | Updated on Sep 3 2017 10:47 AM

అఖిల్.. 'సూర్య కవచం'

అఖిల్.. 'సూర్య కవచం'

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది.

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'అఖిల్' సినిమాలో సయెషా సైగల్ హీరోయిన్గా నటిస్తోంది.

తొలి సినిమాతోనే రికార్డ్ కలెక్షన్ల మీద కన్నేసిన అఖిల్, ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రమోషన్ ముగించుకొని వచ్చిన అఖిల్ ప్రస్తుతం తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టారు. తెలుగులో 'అఖిల్' పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు తమిళ్ లో వేరే టైటిల్ ను ఫైనల్ చేశారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథా కథనాలకు తగ్గట్టుగా 'సూర్య కవచం' అనే టైటిల్ ను తమిళ వర్షన్కు ఫిక్స్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement